25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ముందే వచ్చిన ఐస్ ఆపిల్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్:సర్వ సాధారణంగా తాటి ముంజలు ఎండాకాలంలో వస్తాయి. కానీ ఈ సంవత్సరం చలి కాలం మధ్యలోనే మార్కెట్ లోకి తాటి ముంజలు రావడం అమ్మడం జరుగుతుంది. డోంకల్ నుంచి ఆర్మూర్ వరకు జాతీయ రహదారి నెంబర్ 64 పక్కన  తాటి ముంజలు అమ్ముతున్నారు. తాటి ముంజలను ఐస్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. వీటిలో పోషక పదార్థాలు అధికముగా ఉంటాయి. అలాగే శరీరానికి చల్లాదనమును కలిగిస్తాయి. ఎండాకాలంలో డజన్(12) తాటి ముంజలకు రూ. 50 ఉంటుంది. కానీ ఇప్పుడు ఐస్ అప్పీల్ (12) డజనుకు రూ.150 ధర పలుకుతుంది.అయిన సరే  దారిన పోయే వారు ఎంత ధర అయినా తగేదే లేదని కొనుక్కోవడానికి ఎగబడుతున్నారు.

More articles

Latest article