29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సునీల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయం వద్ద బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అని ఆయన సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు తన వంతు చేస్తున్నారని కొనియాడారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నామన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపద కాలంలో మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళము అవుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏఎంసీ చైర్మన్ పాలెపు నరసయ్య, తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article