25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇన్సూరెన్స్ చెక్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పిట్లం : పెద్ద కొడపగల్ బాలుర ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వి.మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి పీఆర్ఠీయూ టీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు  అల్లాపూర్ కుషాల్,ప్రధాన కార్యదర్శి  పుట్ట శ్రీనివాస్ రెడ్డి,క్రియాశీల సభ్యత్వం పొందినందుకు పీఆర్టీయూ టీఎస్ సంఘం నుండి 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ను అందజేయడం జరిగింది. అదే విదంగా మల్లయ్య కి రావలసిన సర్వీస్ బెనిఫిట్స్ అతి త్వరలో అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పీఆర్ఠీయూ పెద్దకొడపగల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బి. జగదీష్, బి. కిషోర్, కొడపగల్ మండల కార్య వర్గ సభ్యులు,పిట్లం మండల అధ్యక్ష కార్యదర్శులు అలాగే పిట్లం మండల కార్యవర్గం పాల్గొన్నారు.

More articles

Latest article