29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డీ 18,19,20 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా ఏర్గట్ల మండల చెరువులు నింపాలి

Must read

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ,ఎర్గట్ల: కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది కావున ఏర్గట్ల మండలంలో కాకతీయ కాలువ నుండి డీ18,19,20 డిస్ట్రిబ్యూటరీ కేనాల్స్ ద్వారా చెరువులు నింపాలని సీఈ సుధాకర్ రెడ్డి ని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏర్గట్ల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని కలిసిన రైతుల వినతి మేరకు అక్కడి నుండే సీఈతో ఫోన్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. వారం రోజుల్లో డీ 18,19,20 కేనాల్స్ ద్వారా చెరువులు నింపాలని లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.

D 18,19,20 through distributary canals to fill Ergatla mandal ponds

More articles

Latest article