29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి జనరల్ ఆసుపత్రిలో పారాసిటామల్ ట్యాబ్లేట్ ల కొరత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద కామారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రిలో జ్వరం గోళీలు కరువయ్యాయి. అదివారం జ్వరం వచ్చిన కోందరు ఆసుపత్రికి వెల్లడంతో ప్యారసిటామల్ ట్యాబ్లెట్ లు లేవని పార్మసిస్ట్ లు చెప్పడంతో పేషేంట్ లు ఖంగుతిన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పారాసెట్మాల్ 500ఎంజి కరువయ్యింది. జిల్లా జనరల్ ఆస్పత్రిలోనే పారాసిట్మల్ టాబ్లెట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వర్షకాలం సీజనల్ రోగాల కాలంలోఅనారోగ్యంతో వెళ్లిన రోగికి డాక్టర్ ఫీస్క్రిప్షన్ పై పారాసిటమల్ 500ఎంజి టాబ్లెట్లు రాసిపేషెంట్ కు ఇంజక్షన్ చేశారు. ఓపి పరిధిలోని ఫార్మసీకి వెళ్లి టాబ్లెట్స్ అడగడంతో రెండు టాబ్లెట్లు ఇచ్చి పారాసిటీమల్ టాబ్లెట్స్ మా వద్ద లేవు బయట మెడికల్ లో తీసుకోమని సిబ్బంది చెప్పడంతో రోగి అవాక్కయ్యాడు.. కాగ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మాత్రలు లేకపోవడం ఏంటని పలువురు రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటేండేంట్ వివరణ కోసం ప్రయత్నించగా స్పందించలేదు.

Demand for paracetamol tablets in Kamareddy General Hospital

More articles

Latest article