23.7 C
Hyderabad

నగరంలో గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్  ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఎండీ సాబేర్ గౌతంనగర్ కు చెందిన అఫ్సర్ అనే యువకుడితో కలిసి గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 550 గ్రాముల గంజాయి, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించిన సాబేర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

More articles

Latest article