30.9 C
Hyderabad
Monday, August 3, 2026

డంపు మాయం చేసిన వ్యక్తి పై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ,కోటగిరి – నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని మంజీరా రెండవ వంతెన వద్ద గత సోమవారం రెవిన్యూ అధికారులు 18 ట్రిప్పుల అక్రమ ఇసుక డంపును సీజ్ చేయగా రాత్రి రాత్రే డంపు మాయం అయింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రెవిన్యూ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఇసుక డంపును రాత్రికి రాత్రే జేసీబీ ద్వారా ఇసుక మాయం చేసిన పోతంగల్. గ్రామానికి చెందిన గంధపు రాజు అనే వ్యక్తి తో పాటు అతని జేసీబీ పై పోతంగల్ మండల్ తహసీల్దార్ మలయ్య పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జెసిబి ని సీజ్ చేశారు. జెసిబి నుంచి ఇసుక ఎత్తిన వ్యక్తి ఏ టిప్పర్లలో తరలించారు ఎక్కడికి తరలించారు అనేది అధికారులు వెల్లడించలేదు. టిప్పర్ యజమానులు కేసు నమోదు చేస్తారా ఇసుకను దొంగతనం చేసిన కేసులు నమోదు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

More articles

Latest article