26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అస్తవ్యస్తమైన మురికి కాలువలు

Must read

📰 Generate e-Paper Clip

  • పట్టించుకోని అధికారులు
  • మీ డ్రైనేజీలు మీరే శుభ్రం చేసుకోవాలి అంటున్న సెక్రెటరీ

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గల 5వ వార్డులో మురికి కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ మురికి కాలువల గురించి గ్రామపంచాయతీ సెక్రెటరీ, కారోబార్లకు చెప్పిన కూడా పట్టించుకోవడం లేదన్నారు.

Disorganized dirty drains

గత ఎనిమిది నెలలుగా మురికి కాలువలలో ఉన్న మట్టిని తీసి ఎత్తివేయకుండా అలాగే వదిలేశారన్నారు. మురికి కాలువలను శుభ్రపరచకపోవడంతో మురికి కాలువలలోని నీరు ఇంటి ముందరకు వచ్చి చేరుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల టాక్స్ వసూళ్లకు వస్తారు తప్ప మురికి కాలువలపై దృష్టి సాధించడం లేదన్నారు. మురికి కాలువలను శుభ్రపరచాలని సెక్రెటరీకి విన్నవిస్తే మీ డ్రైనేజీలను మీరే శుభ్రం చేసుకోవాలని సమాధానం ఇచ్చారని కాలనీవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Disorganized dirty drains

More articles

Latest article