29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బాలుడిపై ఎలుగుబంటి దాడి

Must read

📰 Generate e-Paper Clip

. కుర్నాపల్లిలో ఘటన

 ఎడపల్లి, బతుకమ్మ: కాల కృత్యాలు తీర్చుకునేందుకు చెరువు గట్టుకు వెళ్లిన బాలుడిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటన ఎడపల్లి మండలం కూర్నాపల్లి ఫారెస్ట్  బీట్ పరిధిలోని కుర్నాపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశ్విత్ కుమార్ కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఉదయం శివాలయం శివారులో చెరువు గట్టువద్ధకు వెళ్లగా  అక్కడే ఉన్న ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటనలో అశ్విత్ కుమార్ మోకాలి  భాగంలో గాయాలు కాగా, ఎలుగు బంటి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఘటనా స్థలాన్ని ఎఫ్ఆర్వో సంజయ్ గౌడ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్, బీట్ ఆఫీసర్ పరిశీలించారు.

A bear attack on a boy

More articles

Latest article