25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కుల, మత విద్వేషాలను సృష్టించకూడదు

Must read

📰 Generate e-Paper Clip

మత గురువు పీఎం ముజామిల్ అహ్మద్ 

 భీమ్‌గల్‌, బతుకమ్మ : కుల, మతాల మధ్య విద్వేషాలను సృష్టించకూడదని, అన్ని మతాలను గౌరవిస్తూ సమాజం పట్ల గౌరవం కలిగి ఉండాలని ముస్లీంల మత గురువు పీ. ఎం ముజామీల్ అహ్మద్ అన్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలోని అంజుమాన్ కమీటీ భవన్ లో నిర్వహించిన సీరత్ ఉల్ నబీ అల్లాహ్ యొక్క శాంతిని ఆశిస్తూ, సమాజాన్ని సంస్కరిస్తూ సభ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు భాద్యతగా తమ పిల్లలను మొబైల్ కు దూరంగా ఉంచాలని, పిల్లలతో మత గ్రంథాలను చదివించాలని, సంస్కృతిని భోదించాలన్నారు. అందరు తమ తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్లను ప్రేమగా చూసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మత గురువులు ముఫ్తీ షౌకత్ బేగ్, ముఫ్తీ మోసిన్, హఫీజ్ జలాలుద్దీన్, ఫహీమ్, అధ్యక్షుడు జమియత్ ఉలేమా హఫీజ్ సిరాజ్ సాహిబ్, ఇమామ్ మరియు మక్కా మసీదు హఫీజ్ ఇలియాస్ సాహిబ్, ఇమామ్, ఖతీబ్ జామా మస్జిద్ బాబాపూర్ హఫీజ్ అద్నాన్, సదర్ సాహిబ్ అజీమ్, అహ్మద్ ఖాన్, షకీల్, షేక్ అమీర్, గ్రామ పెద్దలు అబ్దుల్ మొయిజ్, సూర్జిల్, అతిక్,అంజుమన్ కమిటీ సభ్యులు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article