హైదరాబాద్, బతుకమ్మ : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటీవీ9 జర్నలిస్ట్ రంజిత్ ను ఆదివారం మోహన్ బాబు పరామర్శించి క్షమాపణలు చెప్పారు. మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గోడవల విషయంలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన రంజిత్ పై సీనీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సీనీ నటుడు మోహన్ బాబుపై నగరంలోని పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రంజిత్ హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించి రంజిత్ కు ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు.
