30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బలేరావు సోనియా శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సోనియా మాట్లాడుతూ చలికాలంలో చలి విపరీతంగా పెడుతున్నందున రోడ్లపై, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో భిక్షాటన చేసుకొని జీవించేవారికి, ఉండేందుకు నివాసాలు లేక రోడ్ల పక్కన, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో నిద్రిస్తారని, గత రెండు మూడు రోజుల నుంచి చలి ఎక్కువగా ఉండడంతో వారికి దుప్పట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ బలేరావు శంకర్, ముఖ్య సలహాదారు బలేరావు  కరణ్, కోశాధికారి బలేరావు అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article