బతుకమ్మ, నిజామాబాద్ : లయన్స్ క్లబ్ ఆఫ్ విజేత (320డి)ఆధ్వర్యంలో నగరంలోని బాలసదన్ లోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజేత 320డి అధ్యక్షులు, టీజీవో అధ్యక్షులు అలుక కిషన్ విద్యార్థులకు దుప్పట్లు అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజేత సేవా కార్యక్రమంలో భాగంగా చలికాలంలో విద్యార్థులు చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా చిట్టి నారాయణ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి టీజీవో ప్రధాన కార్యదర్శి అమ`త్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ విజేత సభ్యులు ఉమాకిరణ్, సంజీవ్, సతీష్, జహనాబ్, కపిల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
