25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : మండలం గోద్మేగాం గ్రామంలో ఉచిత గర్భ కోషవ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరంలో పశు ఘన అభివృద్ధి సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ యొక్క శిబిరంలో 39 గర్భకోశ వ్యాధులు 10 కృత్రిమ గర్భాధారణ సాధారణ చికిత్స 7 నట్టల నివారిణి 33 మొత్తం 89 పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో రైతులకు చలికాలములో పశువులు ఎదకు వస్తాయి కాబట్టి మీరు సకాలంలో గుర్తించి అందుబాటులో ఉన్న గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భాధారణ చేయించినట్లయితే మంచి మేలు దూడలు పుడతాయి అధిక పాలన ఇస్తాయని ఇటువంటి ఉచిత గర్వకోశ వ్యాధుల చికిత్స శిబిరము సద్వినియోగము చేసుకోవాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ పి సంతోష్ రైతులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ శిబిరంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ గారు పాల్గొన్నారు.సూపర్వైజర్ బస్వరాజ్,గోపాల మిత్రులు పండరి , రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article