28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

చీనూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని చీనూర్ గ్రామంలో గురువారం కళ్యాణ లక్ష్మి చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మ్యాకల కృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 10 మంది లబ్దిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరం లాంటిదన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి గౌడ్, గంపల వెంకయ్య, ప్రశాంత్, సన్నీ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article