- మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్
భీమ్ గల్, బతుకమ్మ : క్రీడాల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమిని చాలెంజ్ గా తీసుకొంటే గెలుపు తథ్యంమని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. గురువారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కృషి హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచినవారు ఉప్పొంగిపోకుండా,ఓడినవారు నిరాశ పడకుండా ఉండాలని అదే క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని అని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు యువకులకు క్రీడలు ఎంతో ముఖ్యమని వారి దేహదారు డ్యానికి, నైపుణ్యానికి, మనోభాలానికి దొహధపడతాయని అందుకే చదువుతోపాటు క్రీడలలో పాల్గొనాలని సూచించారు. క్రీడల ద్వారా వారి నైపుణ్యం బయటికి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్రీడా పోటీలు నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పట్టణ యువకులు విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో సీఎం కప్ టోర్నమెంట్ ప్రభుత్వం నిర్వహించిందని ఇలాంటి అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు యువకులకు తక్కువ సందర్భాల్లో వస్తాయని ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుని పై స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు సహకరిస్తాయాన్నారు . వ్యాయామ ఉపాధ్యాయులు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ వై. రామకృష్ణ. కౌన్సిలర్ సతీష్ గౌడ్. ఆర్గనైజింగ్ డైరెక్టర్ రమణమూర్తి. అజిత్ రెడ్డి. వినోద్. వాసుదేవ్. లింగం. నరేష్. సత్యనారాయణ. రోహన్. మున్సిపల్ సిబ్బంది క్రీడాకారులు పాల్గొన్నారు.
