30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా పెద్దమ్మ ఆలయ 21వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

–భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గత 21 ఏళ్ళుగా పెద్దమ్మ తల్లి అలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అభిషేకం, అర్చనలు, కళ్యాణం, బోనాల ఊరేగింపు, అన్న సత్రం నిర్వహించినట్లు అలయ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవి తెలిపారు.అయన మాట్లాడుతూ ఈ వార్షికోత్సవంలో భాగంగా గ్రామం నుండి ఆలయం వరకు బోనాలను డప్పు వాయిద్యాలతో ఊరేగిస్తామని, వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొని  ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నాయకులు ముదిరాజ్ సంఘం సభ్యులు మహిళలు యువకులు,సాయిలు, నడ్పి సాయిలు, గంగాధర్, సాగర్, మల్లయ్య, సునీల్, రజనికాంత్, నరేష్, సాయినాథ్, లక్ష్మణ్, సతీష్, రాములు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article