27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం లో తక్షణ ప్రవేశాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కోర్స్ లలో ఖాళీగా ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశాలు డిసెంబర్ 17న ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు  భర్తీ చేస్తారని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు.  ఈ  ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో నిర్వహించబడుతుందని తెలిపారు.  ఈ తక్షణ ప్రవేశాల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీ లా సెట్-2024 / టీజీ పీజీ లా సెట్-2024 ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ప్రవేశాలు స్టేట్ ర్యాంక్ మెరిట్  ఆధారంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ఈ ప్రవేశాలకు హాజరయ్యే  విద్యార్థులు తమ ఒర్జినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుందన్నారు.  తక్షణ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీ రియంబర్స్మెంట్, హాస్టల్ వసతి  ఇవ్వబడదన్నారు. ఎల్ ఎల్ బి లో 14 సీట్లు, ఎల్.ఎల్.ఎమ్ 01 ఒక సీటు ఖాళీగా ఉన్నాయని  తెలిపారు.  తక్షణం ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని  తెలిపారు.

More articles

Latest article