ఏర్గట్ల, బతుకమ్మ: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఏర్గట్ల లో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిరర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గంగా ప్రసాద్, గడ్డం జీవన్ రెడ్డి, జింక అనిల్, రేండ్ల రమేశ్ ముదిరాజ్, బద్దం లింగారెడ్డి, బెజ్జారం భాను, గుమ్మిర్యాల చిన్న సంజీవ్ యాదవ్, ముస్క మోహన్ రెడ్డి, పన్నాల నర్సారెడ్డి, సున్నపు ఇస్తారి, కూరాకుల బొర్రన్న, రోక్కెడ చిన్న సాయిలు, ఎండీ మునీర్ తదితరులు పాల్గొన్నారు.
