25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సీసీఆర్ అధ్వర్యంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి /నిజామాబాద్, బతుకమ్మ : ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 న జరుపుకొనే  అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉమ్మడి జిల్లా సీసీఆర్ సభ్యులు సోమవారం నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీని కలిశారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడిన వారిని టర్మినేషన్ చేసి, పింఛన్ రాకుండా చట్టం చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారుల వివరాలతో కూడిన బోర్డులు అమర్చాలని వినతి పత్రం కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఉమ్మడి నిజామాబాదు జిల్లా ప్రతినిధుల ఆధ్వర్యంలో షేక్ ముజీబ్ ఆధ్వర్యంలో ఏసీబీ డీఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు పోరాడాలని, ఎక్కడైనా అవినీతి జరిగితే ఏసీబీ  టోల్ ఫ్రీ నెంబర్ 1064, 9154388950 పై ఫోన్ చేసి సమాచారాన్ని ధైర్యంగా అందించాలని పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిసిఆర్ సంస్థకు  అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్ మొహమ్మద్ కరీముద్దీన్, స్టేట్ సెక్రెటరీ,  జోనల్ ఇన్చార్జి, నార్త్ తెలంగాణ జోన్ – 1 ప్రతినిధులు షేక్ ముజీబ్, మిర్జాపురం రామకృష్ణ, యూసఫ్ ఉద్దీన్, నయీమ్ ఖాన్ బిచ్కుంద, బి. సాయిలు, కే సుమన్, దేకొండ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article