కామారెడ్డి, బతుకమ్మ : దేవన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్లూర్ గ్రామానికి చెందిన మహిళ అనుమానాస్పద స్థతిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన గంగారపు పోచమ్మను అడ్లూర్ గ్రామానికి చెందిన లింగయ్యతో కొంత కాలం క్రితం వివాహమైంది. దంపతులిద్దరు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే శనివారం అడ్లూర్ నుంచి రాజయ్య అనే వ్యక్తి పోచమ్మ సోదరుడు నర్సింహకు ఫోన్ చేసి మీ అక్క మృతి చెందిందని సమాచారం అందించాడు. పోచమ్మ సోదరుడు తన నాన్నపోచయ్యకు పోచమ్మ చనిపోయిందని తెలిపారు. వెంటనే పోచయ్య అతని సోదరుడు భద్రయ్య, కుమారుడు నర్సింహ అడ్లూర్ గ్రామానికి చేరుకున్నారు. వారు పోచమ్మ మృతదేహాన్ని పరిశీలించగా మెడ చుట్టూ కమిలిన గాయాలు, కుడి భుజంపై చిన్న గాయం గమనించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
