24 C
Hyderabad
Sunday, August 2, 2026

పెన్షనర్స్ డే ను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసెంబర్ 17 జాతీయ పెన్షన్స్ డే సందర్భంగా నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ నందు తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తెలిపారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్స్ డే సందర్భంగా రెండు రోజులపాటు ఆటల పోటీలను రిటైర్డ్ ఉద్యోగులకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  పెన్షన్ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించిన దినంగా డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెన్షన్ అనేది ప్రమాదంలో పడిందని దానిని కాపాడుకోవడం  కోసం పునరకితం అవటం కోసం ఈ కార్యక్రమాన్ని  నిజామాబాదులో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఉద్యోగులందరూ డిసెంబర్ 17 న్యూ అంబేద్కర్ భవన్ కు ఉదయం 10:30 గంటలకు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్, జాతీయ రాష్ట్ర పెన్షనర్స్ యూనియన్ నాయకులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.

More articles

Latest article