25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మహనీయునికి ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మద్నూర్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా  విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. బిచ్కుంద మండలంలోని గుండేకల్లుర్ గ్రామంలో శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘ నాయకుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, యాదవ్ రావు, లాలయ్య, గోపాల్, రాజేందర్, బాలాజీ, నవనాథ్, బస్వంత్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article