. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.39.84 కోట్లు మంజూరు
కామారెడ్డి, బతుకమ్మ: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద కామారెడ్డి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్టేషన్ అభివృద్ధికి రూ.39.84కోట్లు మంజూరు చేయగా, స్టేషన్ భవన నిర్మాణంతోపాటు ప్రాంగణం అభివృద్ది, బుకింగ్ కార్యాలయం, మూడు లిఫ్ట్ లు, రెండు ఎస్కలేటర్లతోపాటు పాదచారుల వంతెన, వీఐపీ లాంజ్ తదితర పనులను చేపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను శరవేగంగా చేపడుతుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

