బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి పెద్ద చెరువు తూమును డీసీసీబీ డైరెక్టర్ సిద్ధరాములు, మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ రైతులకు యాసంగి పంటలకు ఇబ్బంది కాకుండా నీరు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
