29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా గజ్జలమ్మ జాతర

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో రెండు రోజుల పాటు కొనసాగే గజ్జలమ్మ దేవి జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పోతురాజుల విన్యాసాల మధ్య గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా గ్రామ దేవతల వద్దకు వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలోని పాడి పంటలు, పిల్లాపాపలు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Grand Gajjalamma fair

More articles

Latest article