బతుకమ్మ,మోర్తాడ్:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన వారోత్సవాలలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మోర్తాడ్ మండల కేంద్రంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సుంకేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న బండి అనుశ్రీ అనే విద్యార్థి మొదటి బహుమతి సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
