23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మాచారెడ్డి సింగిల్ విండో లో రైతు పండగ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మాచారెడ్డి: ప్రభుత్వ ఆదేశాల మేరకు మాచారెడ్డి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్ పూల్ చంద్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ రైతులకు సేవలందిస్తున్న ట్టు తెలిపారు. సన్నాలు కొనుగోలు చేసి రైతులకు బోనస్ అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంఘం నుండి రైతులకు రుణ మాఫీ అయిన రైతులకు మళ్ళీ పంట రుణాలిచ్చామన్నారు. సంఘం నుండి యూరియా, వరి విత్తనాలు, సబ్సిడీపై జనుము, జీలుగు పచ్చి రొట్ట ఎరువు విత్తనాలు సరియైన సమయములో రైతులకు సరఫరా చేస్తూ అన్ని విదాల సేవలు చేస్తున్నామని ఆయన వివరించారు. ధాన్యం డబ్బులు 3 రోజుల్లో రైతుల ఖాతా లో జమయ్యే విధంగా సేవలందిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో రైతులు, కార్యదర్శి చంద్రారెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article