29 C
Hyderabad
Monday, August 3, 2026

గల్ఫ్ మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కమ్మర్ పల్లి: కమ్మర్ పల్లీ మండలంలోని కొనసముందర్ గ్రామానికి చెందిన ఇబ్రహీంపట్నం భూమేష్ ఇటీవల కువైట్ లో మృతి చెందాడు. భూమేష్ ది నిరుపేద కుటుంబం కావడంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు కువైట్ లోని పినిస్కో కంపెనీకి చెందిన దాతలు ముందుకు వచ్చి రూ. 91వేల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. పినిస్కో కంపెనీలో పని చేస్తున్న నడుకూడ గ్రామానికి చెందిన జల గంగాధర్ రూ.52 500, మంత్రి తిరుపతి రూ.27, 500, కోటూరి ధర్మ ప్రసాద్ రూ.11వేలు ఆర్థిక సహాయం అందించగా అట్టి మొత్తం రూ.91వేలు ఆర్థిక సహాయాన్ని శుక్రవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. భూమేష్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబానికి బాసటగా నిలిచిన దాతలకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు హన్మాండ్లు, సామా భూమా రెడ్డి, చెంగల అశోక్, బద్దం బాలు రెడ్డి, బాపు రెడ్డి, కొండ నాగరాజు, మేకల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article