27.5 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం,  మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. తొలుత కలెక్టరు కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్ స్కూల్,కాలేజి లో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు.

Quality food should be provided to the students

హాస్టల్ పరిసరాలను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. అలాగే నీటి పైప్ లైన్ లీకేజీలను సరిచేయాలని తెలిపారు. స్టోర్ రూం లను పరిశీలించి స్టాక్ ఎప్పుడు వచ్చింది, స్టాక్ ఎంట్రీ నమీదులను పరిశీలించారు. బియ్యంలో  రాళ్ళు, పురుగులు లేకుండా శుభ్రం చేసి వంటకు ఉపయోగించాలని, ఇతర సరుకులు సరిచేయాలని తెలిపారు. వంటకాలు శుభ్రంగా, రుచికరంగా చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సబ్బులను ఏర్పాటుచేయాలని తెలిపారు. హాస్టల్ లోని మెస్ కమిటీ ప్రతీ రోజు చేసే వంటలను పరిశీలించాలని అన్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పదవతరగతి, ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని తెలిపారు. హాస్టల్ పరిసరాలలో శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ డిప్యూటీ ఈఈ నీ ఆదేశించారు. విద్యార్థుల చదువుపై, భోజనం, నిత్యావసర సరుకులు తదితర అంశాలపై ప్రిన్సిపాల్ పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు.

Quality food should be provided to the students

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రజిత, ప్రిన్సిపాల్ అమర్ సింగ్, రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్, ఫుడ్ సేఫ్టీ అధికారి శిరీష, తహసీల్దార్ సాయిలు, మున్సిపల్ డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఎంపీడీఓ, తదితరులు పాల్గొన్నారు.

Quality food should be provided to the students

More articles

Latest article