27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ముప్కాల్:మండలంలోని నాగంపేట్ గ్రామంలో మంగళవారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బాధిత లబ్ధిదారుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు మంజూరు అయిన చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేయడం జరిగిందని పార్టీ నాయకులు దాసరి గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article