నవీపేట్, బతుకమ్మ: డ్యూటీ లో ఉన్న డాక్టర్లను బెదిరించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, పని చేయని డాక్టర్లని ప్రజలు ప్రశ్నించే హక్కు ఉందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు సుదర్శన్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. నూతనంగా నిర్మించిన శివ పంచాయతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మోకాన్ పల్లి కస్తూర్బా గాంధీ స్కూల్ లో అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
