25.3 C
Hyderabad

ఎమ్మెల్యేను కలిసిన జీకే తాండ గ్రామస్తులు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని గుట్ట కింది(జీకే)తండా గ్రామ నాయకులు,విడిసి పెద్దలు,రైతులు, గ్రామస్తులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని హైదరాబాదు లోని తన నివాసం వద్ద కలిసి గ్రామంలోని రైతుల సమస్యలను తెలపడం జరిగిందన్నారు.దీనికి ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు.తొందర్లోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను తీరుస్తానని ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందనన్నారు. త్వరలోనే రైతుల సమస్యలు ఇతర సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్,గుట్ట కింది తండా మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, మాజీ ఎంపిటిసి పరశురాం నాయక్,  తీర్మన్ పల్లి మాజీ ఎంపిటిసి కిషన్ ,గుట్ట కింది తండా గ్రామ విడిసి అధ్యక్షులు శివరం నాయక్, డైరెక్టర్ బాబురావు, తండా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article