25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజు మరణం పార్టీకి తీరని లోటు

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్  :  17వ డివిజన్ కార్పొరేటర్ మాయావర్ సవిత భర్త రాజు అనారోగ్య కారణంతో  మరణించాడు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్న రాజు కుటుంబాన్ని బుధవారం పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికీ మనోధైర్యం చెప్పి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రాజు మరణం పార్టీకి తీరని లోటని వారి పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ,మండల అధ్యక్షులు గడ్డం రాజు, నాయకులు ప్రభాకర్, భాస్కర్, ఆనంద్, ఎస్ సి మోర్చా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Raju's death is a great loss to the party

More articles

Latest article