నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్ పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారిని పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండు చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవిత మంగళవారం మేయర్ నీతూ కిరణ్ కు ఫోన్ చేసి శేఖర్ కు సంబంధించిన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. శేఖర్ పై జరిగిన దాడి గురించి ఆరా తీశారు. మేయర్ నీతూ కిరణ్ కు ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
