25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్య..

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : రుణం తీసుకున్న పాపానికి ప్రతి వారం చెల్లించాల్సిన వాయిదా చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు గ్రూప్ సభ్యుల చేత వేధింపులకు పాల్పడడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం నాగారంలోని వడ్డెర కాలనీలో చోటుచేసుకుంది. దండ్ల రాజేష్ (32) అనే యువకుడు తన వ్యక్తిగత అవసరాల కోసం ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.40 వేల రుణాన్ని తీసుకున్నాడు. స్థానికంగా గ్రూపు వారి సభ్యులుగా రుణం తీసుకున్న రాజేష్ ప్రతివారం 1500 రూపాయలు కిస్తి చెల్లించేవాడు. ఇద్దరు కూతుర్లు ఉన్న రాజేష్ కు ఇటీవల కొడుకు పుట్టడంతో కూలి పనులకు వెళ్లలేదు. దానితో ప్రతివారం చెల్లించాల్సిన వాయిదా చెల్లించకపోవడంతో మంగళవారం ఫైనాన్స్ సంస్థ నిర్వాకులు గ్రూప్ సభ్యుల చేత ఇంటి వద్ద హంగామా చేశారు. రాజేష్ ను నిలదీసి అవమాన పరిచారు. దానితో రాజేష్ తన ఇంటిలో సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

More articles

Latest article