29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి, జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి ఆయా గ్రామాలలో తొలి మహిళా ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అలాగే ఆయా గ్రామాలలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి, శశికుమార్, చేపూరి రమేష్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి సీనియర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More articles

Latest article