24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాలరత్న పురస్కారానికి ఎంపికైన ఏర్గట్ల విద్యార్థి శ్రీనిధి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: బాలల దినోత్సవం పురస్కరించుకొని కమలాకర మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బాలరత్న పురస్కారం అందివ్వడం జరుగుతుంది.2024 సంవత్సరానికి గాను ఏర్గట్ల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీనిధి బాలరత్న, బాల ప్రతిభ,పురస్కారానికి ఎంపిక అయింది.కరాటే రంగంలో చక్కని ప్రతిభ కనబరిచి అనేక ప్రశంసలు పొందడమే కాక బ్లాక్ బెల్ట్ సాధించడం,సాహిత్య రంగంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నందుకు, ఈ పురస్కారానికి ఎంపిక చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణా చారి తెలిపారు. నవంబర్ 19న హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయల తెలుగు భాషా నిలయంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారని తెలిపారు. బాలరత్న బాల ప్రతిభ పురస్కారానికి ఎంపికైన శ్రీనిధిని పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, పవన్,ప్రసాద్,ప్రవీణ్ శర్మ, రాజనర్సయ్య,రాజేందర్, గంగాధర్,రాజశేఖర్,శ్రీనివాస్, సబిత,అభినందించారు.

More articles

Latest article