27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డిసెంబర్ 1న మాలల సింహగర్జన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడంతోపాటు బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులుగా మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలల సింహగర్జన నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్  లో సింహగర్జనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సింహగర్జనకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్క మాల తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ గైనిగంగారం, కామారెడ్డి జిల్లా చైర్మన్ బంగారు సాయిలు, మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు కేశ్ పల్లి రవి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుంకరి మోహన్, మాల సంఘం పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, దళిత మహా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

More articles

Latest article