నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చలో బాసర ట్రిపుల్ ఐటీ కి వెళ్లకుండా జిల్లా కేంద్రంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ, నాయకులు నవీన్, సిర్ప నితిన్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అలాగే బస్టాండ్, రైల్వేస్టేషన్ లో తనిఖీలు నిర్వహించి మరికొంత మంది విద్యార్థిని నాయకులను బాసరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఇది ప్రజాపాలన కాదని, దగా పాలన అని మండిపడ్డారు. స్వాతిప్రియ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై రౌడీల్లా ప్రవర్తించిన సీఎస్ వో రాకేశ్ తోపాటు బాధ్యులపైన క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.
