25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోగానే ఏం చేయాలో అర్థం కాని బిజెపి, టీఆర్ఎస్ నాయకులు తోక కాలిన కోతుల లాగా మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిస్తే అందులో మూడు నెలలు ఎలక్షన్ల సమయం గడిచిందని మిగిలిన సమయంలో ఇచ్చిన హామీలను మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాని, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం గాని, రైతు రుణమాఫీ చేయడం గాని, ఉచితగా సిలిండర్ అందించడం లాంటి హామీలను నెరవేర్చిందని మిగిలిన వాటిని కూడా తొందరలో నెరవేరుస్తుందని ఆయన అన్నారు. రుణమాఫీ కానీ వారికి రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక పరంగా ముందుకు వెళుతుందని, 2 లక్షల పైన  ఉన్న వారికి పైన మిగిలిన డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పేరుతో అనర్హులైన వారికి రైతుబంధువేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాకుండా అర్హులైన వారికి రైతుబంధు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నందున రైతుబంధు ఆలస్యం అవుతుందని ప్రజలు గ్రహించారాని ఇది టిఆర్ఎస్ నాయకులు,బిజెపి నాయకులు ఎప్పుడు గ్రహిస్తారో ఆలోచించాలని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో ఉనికి కాపాడుకోవడానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ,అసలు ప్రజలకు గాని పార్టీలో గాని అరవింద్ అసలు కనిపించడం లేదని, తనను ఎవరు పట్టించుకోవడంలేదని ఉనికి నిలబెట్టుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అదే విధంగా రాష్ట్రస్థాయిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైండని కేటీఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారని ఆయన అన్నారు. టిఆర్ఎస్, బిజెపి నాయకులు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఒక్కసారి వారు ఆత్మ ఆలోచన చేసుకొని తమ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చాయో చూసుకోవాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, నరేందర్ గౌడ్, వైశాక్షి సంతోష్, కార్పొరేటర్ గడుగు రోహిత్,  నాయకులు పంచరెడ్డి  చరణ్ తదితరులున్నారు.

More articles

Latest article