27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏర్గట్ల ఉపాధ్యాయుడు సైన్స్ ఫెస్ట్ వల్ కు ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: జిల్లా ఉన్నత పాఠశాల ఏర్గట్లకు చెందిన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు గాండ్ల రాజశేఖర్ నవంబర్ 30 వ తేదీ నుండి డిసెంబర్ మూడవ తేదీ వరకు అస్సాంలోని గౌహతి ఐఐటిలో జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024 కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచారి తెలియజేశారు. జాతీయస్థాయి సైన్స్ ఫెస్టివల్ కు పాఠశాల నుండి ఏర్గట్ల ఉపాధ్యాయుడు ఎంపిక కావడం మా పాఠశాలకి ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గౌహతిలో జరిగే సైన్స్ ఫెస్టివల్ లో వినూత్నమైన కొన్ని కృత్యాలను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్ ,పవన్, S శ్రీనివాస్, విజయ్ కుమార్, రాజేందర్, రాజ నర్సయ్య, సమిత, ప్రవీణ్ శర్మ, గంగాధర్, కె శ్రీనివాస్, ఇందిరా, జ్యోతి,సబితా, గంగమోహన్,నరేష్,ట్వింకిల్ కుమార్ లు శాలువాతో సత్కరించి రాజశేఖర్ ను అభినందించారు.

More articles

Latest article