24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ కు రెండేళ్ళ జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మః                                                                                                                                                                 
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేసిన పోరెడ్డి అశోక్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిందని నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బొబ్బిలివీధికి చెందిన బండారి అరవింద్ అనే కాంట్రాక్టర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ అయిన అశోక్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ 2012 మే 29న ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అశోక్ కు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.40 వేలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. మొత్తం జరిమానా రూ.40 వేలు చెల్లించని యేడల ఒక నెల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article