26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పీఆర్టీయూ అధ్యక్షుడిగా పెద్దోళ్ల భూమయ్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నవీపేట మండల పీఆర్టీయూ నవీపేట మండల అధ్యక్షుడిగా పెద్దోళ్ల భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా బోధన్కర్ శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  నియన్ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం రైతు వేదికలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, 2024-26 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  అసోసియేట్ ప్రెసిడెంట్ గా వెంకటేశ్, ఉపాధ్యక్షుడిగా రాకేశ్ రెడ్డి, కార్యదర్శిగా అశోక్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా కవితారెడ్డి, కార్యదర్శి సువర్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఇల్తెపు శంకర్, గణేశ్ రావు, గోవర్ధన్, రచ్చ మురళి, రవీందరెడ్డి, ఆయా మండలాల పీఆర్టీయూ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

More articles

Latest article