బతుకమ్మ,మద్నూర్: వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా జి.సౌజన్య భర్త అయిల్వార్ రమేష్ ని నియమించిన సందర్భంగా.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి సతీమణి తోట అర్చన తో పాటు సౌజన్య ఇంటికి వెళ్లి నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా పరమేష్ పటేల్ తో పాటు 16 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నూతన పాలకవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గం సభ్యులు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు పూలమాలవేసి కల్వకుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

