భిక్కనూర్, బతుకమ్మ: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేశ్, బండి రాములు, అనిల్, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

