27.4 C
Hyderabad

హత్యాయత్నం కేసులో ఇద్దరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : హత్యాయత్నం కేసులో సతీష్, జావిద్ అనే ఇద్దరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, తల100 రూపాయల ఫైన్ విధిస్తూ బోధన్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. బోధన్ పట్టణ ఎస్ హెచ్ వో వి.వెంకట నారాయణ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… 2019 వ సంవత్సరంలో శక్కర్ నగర్ లోని సులభ్ కాంప్లెక్స్ వద్ద సయ్యద్ అజ్గర్ అనే వ్యక్తి టాయిలెట్ కు వెళుతుండగా సతీష్, జావిద్ లు కల్లు సీసతో కడుపులో పొడిచి హత్యా యత్నానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపగా కేసు పూర్వాపరాలు పరిశీలించి సాక్ష్యాధారాలతో నిరూపణ కావడంతో న్యాయమూర్తి అజయ్ కుమార్ జావిద్, సతీష్ లకు ఐదేళ్లు కఠిన కారగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

More articles

Latest article