27.2 C
Hyderabad

ఆర్మూర్ నూతన సిఐగా సత్యనారాయణ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నూతన సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ గౌడ్ కు జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ఎం జె ఎఫ్ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ న్యాయం చేయాలని, అదేవిధంగా పట్టణంలోని ప్రధాన ట్రాఫిక్ సమస్య పై దృష్టి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, జేస్సు ఆనంద్, మెడికల్ అసోసియేషన్ మాజి అధ్యక్షులు అల్జాపూర్ రాజేశ్వర్, సినియర్ సిటిజన్ అధ్యక్షులు నారాయన్ వర్మ, రాంప్రసాద్, రాజేందర్, డీజే వికాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article