రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాయకుర్ సబ్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు రుద్రూర్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలియజేశారు. వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
