28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతీ ఇంటికి విధిగా స్టిక్కర్ అతికించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • భీమ్ గల్ మండలంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సర్వే లో భాగంగా ఇంటింటికి స్టికర్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ శుక్రవారం భీమ్ గల్ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఇందులో భాగంగా భీమ్ గల్ పట్టణంతో పాటు మండలంలోని చేంగల్, బడా భీమ్ గల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా చివరి రోజు అవ్వడం మూలాన ఎన్యూమరేటర్లు ఎక్కడెక్కడ స్టికర్లు వేస్తున్నారో స్వయంగా వెళ్లి పరిశీలించారు.పట్టణ కేంద్రంలోని 7 వార్డులో స్టిక్కరింగ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఏ. సీ మాట్లాడుతూ స్టిక్కరింగ్ లో ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తేవాలని, స్టిక్కర్లను విధిగా అన్ని ఇండ్లకు మిస్ కాకుండా అతికించాలని సూచించారు. ఎన్యూమ రెటర్ల స్టిక్కరింగ్ తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్, మండల రెవిన్యూ అధికారులు, సూపవైజర్లు, జి. పి సెక్రటరీలు, ఎన్యూమరెటర్లు ఉన్నారు.

More articles

Latest article